Soundarya Lahari

Thursday, August 23, 2018

Subbarao : సుబ్బారావు చేసే పని

మా సుబ్బారావు చాలా మంచోడు ఆశైతే  వుంది. కానీ సరైన పనే లేదు .... పనిచేసే ఆలోచనా  లేదు. పాపం భగవంతుడికే జాలేసింది. వచ్చి ప్రత్యక్షమయ్యాడు ... 

ఏం కావాలో కోరుకొమ్మన్నాడు. సుబ్బారావుకు సంతోషమనిపించింది. "స్వామీ ! నెను చల్లగా ఉండాలి. పైకి ఎదగాలి నాతో పాటు నలుగురిని పైకి తీసుకెళ్ళగలగాలి మరో చిన్న కోరిక నాకు పెద్దగా శ్రమ ఉండకూడదు" అన్నాడు . తధాస్తు అన్నాడు దేముడు.  

మరుసటి రోజు సుబ్బారావును లిఫ్టు బోయ్ గా మార్చారు

మళ్ళీ భగవంతుని ప్రార్ధించాడు సుబ్బారావు. మరలా ప్రత్యక్షమయిన భగవంతుడు , "ఏమి భక్తా !
ఏమయింది" అన్నాడు.  
"స్వామి ఎదగటమంటే ... లిఫ్టులో పైకి నలుగురుని తీసుకెళ్ళటం కాదుగా కంటి ముందు డబ్బులుండాలి" అన్నాడు .  తధాస్తు అంటూ మళ్ళి మాయమయ్యాడు స్వామి

 మరుసటి రోజు సుబ్బారావుకు ATM వద్ద వాచ్ మెన్ గా కూర్చోబెట్టారు. కంటిముందు ఇరవైనాలుగు గంటలూ డబ్బులుంటాయి అందరూ డబ్బులు తీసుకుంటూ ఉంటారు
కానీ ... మన సుబ్బారావు మాత్రం వాచ్ మానే.

సుబ్బారావు మళ్ళీ భగవంతుని ప్రార్థించాడు. " ఏం భక్తా ! ఇబ్బంది పడుతున్నట్టున్నావ్. ఏమయింది?" అన్నాడు.  "ఏమవటమేంటి సామీ ! ఏదడిగినా మరేదో ఇస్తావ్ ! ఎలా సామీ?" అన్నాడు.  
"కంటి ముందు డబ్బులన్నావుగా ఇచ్చాను" అన్నాడు స్వామి.
"కంటి ముందు అంటే ATM కాదు నా టేబిల్ మీదకు రావాలి" అన్నాడు.
 "నీవు ఏ పనీ చేయవు కదా భక్తా! అందుకే అటువంటి పని కల్పించాను అంత చికాకు పడకుండా ఆఖరు సారిగా అడుగు" అన్నాడు స్వామి.
"నాకు పని చేయటం రాదు. ప్రతివాడు నా దగ్గరకే రావాలి. వాడి పని వాడే చేసుకుని వెళ్ళాలి. కానీ నా టేబిల్ మీదకు డబ్బు రావాలి".
తధాస్తు అన్నాడు

 మరుసటీ రోజు సుబ్బారావుకు ...  సులబ్ కాంప్లెక్ష్ దగ్గర కూర్చునే అదృష్టం దక్కీంది

ఎవరి పని వారే చూసుకుంటారు. టేబిల్ పై డబ్బులు పెట్టి వెళతారు

సుబ్బారావు మళ్ళీ ప్రార్థించాడు భగవంతుడు రాలేదు

ముగింపు :
మనం అడిగేటప్పుడు ‌.. ఎవరినైనా సరే. పూర్తిగా అర్ధమయ్యెటట్లుగా క్లారిటీగా అడగాలి
లేదా.. మన పని మనం చేసుకోవాలి

No comments:

Post a Comment

Put in your thoughts here ...